బీజేపీతో పాటు ఈటల కూడా మునిగిపోవడం ఖాయం: మంత్రి జగదీశ్ రెడ్డి
- బీజేపీలో చేరిన ఈటల
- ఈటల మునిగిపోయే నావ ఎక్కారన్న జగదీశ్ రెడ్డి
- తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలో చేరారని వ్యాఖ్యలు
- హుజూరాబాద్ ప్రజలకు ద్రోహం చేశారని కామెంట్
ఈటల రాజేందర్ మునిగిపోయే నావ ఎక్కారని, బీజేపీతో పాటు ఈటల కూడా మునిగిపోతారని వ్యాఖ్యానించారు. సొంత అజెండాతోనే ఈటల బీజేపీలో చేరారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. అసలు ఈటల బీజేపీలో చేరడం హాస్యాస్పద అంశమని, ఆయన చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదని పేర్కొన్నారు.