తెలంగాణలో గత 24 గంటల్లో 1,771 కరోనా కేసులు
- రాష్ట్రంలో మరో 1,20,525 కరోనా టెస్టులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 171 మందికి కరోనా
- అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 2 కేసులు
- ఇంకా 22,133 మందికి కొనసాగుతున్న చికిత్స
అదే సమయంలో 2,384 మంది కరోనా నుంచి కోలుకోగా... 13 మంది మృతి చెందారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,469కి పెరిగింది. తెలంగాణలో ఇప్పటివరకు 6,02,089 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,76,487 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,133 మంది చికిత్స పొందుతున్నారు.
