రైల్వేలో రోజుకు 150 మందికి కరోనా.. మొత్తం 2,400 మంది మృతి

09-06-2021 Wed 08:03 | National
  • ఇప్పటి వరకు రైల్వేలో ఏడున్నర లక్షల మందికి వ్యాక్సినేషన్
  • కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు రైల్వే ఆసుపత్రులలో సదుపాయాల పెంపు
  • దేశ వ్యాప్తంగా 889 రైళ్లతో సేవలు
  • రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ
భారతీయ రైల్వేలో రోజుకు 150 మంది ఉద్యోగులు కరోనా బారినపడుతున్నారని రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో సునీత్ శర్మ తెలిపారు. నిన్న  ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. రైల్వేలోని 12 లక్షల మంది సిబ్బందిలో 7.50 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని వివరించారు.

అలాగే, ఈ మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 2,400 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. కాబట్టి రైల్వే ఉద్యోగులను ప్రాధాన్య జాబితాలో చేర్చి టీకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్టు చెప్పారు. కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు రైల్వే ఆసుపత్రులలో వెంటిలేటర్లు, పడకలు పెంచడంతోపాటు ఆక్సిజన్ ప్లాంట్లను కూడా నెలకొల్పినట్టు తెలిపారు.

ముంబై-హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇంకా డీపీఆర్ తయారీలోనే ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కరోనా ఆంక్షల వల్ల రైళ్లను పూర్తిస్థాయిలో నడపలేకపోతున్నామని , ప్రస్తుతం దేశవ్యాప్తంగా 889 ప్రత్యేక రైళ్లు, 479 ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నట్టు సునీత్ శర్మ తెలిపారు.
Indian RailwaysCorona VirusSuneet SharmaRailway Board

More Telugu News

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55
..more