తిరుమల వీడినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: రఘురామకృష్ణరాజు వ్యవహారంపై టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి
- ఆర్మీ ఆసుపత్రిలో తనపై కుట్ర జరిగిందన్న రఘురామ
- దీనికి ధర్మారెడ్డి సహకరించారని ఆరోపణ
- ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కె.పి.రెడ్డిని హైదరాబాద్‌లో కలిశారని వాదన
- ఆరోపణల్ని కొట్టిపారేసిన ధర్మారెడ్డి
దీనిపై తాజాగా ఓ న్యూస్ చానెల్ యాంకర్ ఫోన్లో అడిగిన ప్రశ్నలకు ధర్మారెడ్డి స్పందించారు. తాను హైదరాబాద్ వచ్చానని చెబుతున్న తేదీల్లో తిరుమలలోనే ఉన్నానని నిరూపించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. మే 3 నుంచి 18 వరకు తాను సుందరకాండ దీక్షలో ఉన్నానని తెలిపారు. ఆ తర్వాత కూడా తాను తిరుమల విడిచి వెళ్లలేదన్నారు.
ఒకవేళ తాను తిరుమల దాటి వెళ్లినట్లు నిరూపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు. కె.పి.రెడ్డికి, తనకూ ఎలాంటి పరిచయం లేదన్నారు. అవసరమైతే గత మూడు సంవత్సరాల కాల్ రికార్డింగ్స్ చూసుకోవచ్చన్నారు.