తెలంగాణలో కొత్తగా 1,933 కరోనా పాజిటివ్ కేసుల వెల్లడి
- గత 24 గంటల్లో 1,32,996 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 165 కొత్త కేసులు
- రాష్ట్రంలో 16 మంది మృతి
- ఇంకా 25,406 మందికి చికిత్స
అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 3,527 మంది కోలుకోగా, 16 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,394కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 5,93,103 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,64,303 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 25,406 మందికి చికిత్స కొనసాగుతోంది. రాష్ట్రంలో రికవరీ రేటు 95.14 శాతానికి పెరిగింది.