తెలంగాణ కరోనా వ్యాక్సిన్ గ్లోబల్ టెండర్లకు స్పందన కరవు
- వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు
- పలు రాష్ట్రాల బాటలో తెలంగాణ
- నిన్నటితో ముగిసిన గ్లోబల్ టెండర్ల గడువు
- ఒక్క సంస్థ కూడా ఆసక్తి చూపని వైనం
దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులైన సీరం, భారత్ బయోటెక్ నుంచి పరిమిత సంఖ్యలో డోసులు అందుతున్న నేపథ్యంలో గ్లోబల్ టెండర్లపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. కానీ తాజా పరిణామంతో, కోటి వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేయాలని భావించిన తెలంగాణ సర్కారు ఆశలకు తీవ్ర విఘాతం ఏర్పడింది.