ట్రంప్ ఖాతాలను రెండేళ్ల పాటు నిలిపివేసిన ఫేస్ బుక్
- సోషల్ మీడియాలో దురుసు వ్యాఖ్యల ఫలితం
- ఇప్పటికే ట్రంప్ ఖాతా మూసేసిన ట్విట్టర్
- జనవరి 7 నుంచే ఫేస్ బుక్ ఖాతాలపై నిషేధం
- నిషేధాన్ని రెండేళ్లకు పొడిగించిన ఫేస్ బుక్
- ఇది తన అభిమానులను అవమానించడమేనన్న ట్రంప్
ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. ట్రంప్ ఖాతాలను రెండేళ్ల పాటు నిలిపివేసింది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లోని ఆయన ఖాతాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. తమ నియమ నిబంధలను ట్రంప్ తీవ్రస్థాయిలో ఉల్లంఘించారని ఫేస్ బుక్ ఓ ప్రకటనలో పేర్కొంది. జనవరి 7నే ట్రంప్ ఖాతాల కార్యకలాపాలను అడ్డుకున్న ఫేస్ బుక్... ఈ తేదీ నుంచే తాజా నిషేధం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
దీనిపై ట్రంప్ స్పందించారు. ఫేస్ బుక్ తన చర్య ద్వారా, గత ఎన్నికల్లో తనకు ఓటేసిన కోట్లమంది ప్రజలను అవమానించిందని పేర్కొన్నారు.