బీజేపీ ఎంపీ రంజిత కారుపై రాళ్లు, ఇనుప రాడ్లతో దాడి.. వీడియో ఇదిగో

attack on mp ranjitha
  • రాజస్థాన్‌లోని భరత్‌పూర్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న రంజిత
  • ఆసుప‌త్రి నుంచి ఇంటికి వెళ్తుండ‌గా ఘ‌ట‌న‌
  • దాడి చేసిన వారిని వదిలిపెట్టనన్న రంజిత‌
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ లోక్‌సభ ఎంపీ రంజిత కోలి వెళ్తున్న కారుపై భీక‌ర దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను రంజిత ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. క‌రోనా బాధితుల‌ను ప‌రామ‌ర్శించి, ధైర్యం చెప్పేందుకు ఆమె ప‌లు ఆసుప‌త్రుల‌ను సంద‌ర్శించారు. తిరుగు ప్రయాణంలో ఇటీవ‌ల‌ రాత్రి 11.30 గంటల సమయంలో ధర్సోని గ్రామం మీదుగా భరత్‌పూర్‌ వెళ్తుండ‌గా, గుర్తు తెలియ‌ని వ్యక్తులు రాళ్లు, ఇనుప రాడ్లతో దాడికి దిగారు.

కారు అద్దాలు ధ్వంస‌మ‌య్యాయి. ఎంపీ అనుచ‌రుల‌కు  స్వల్ప గాయాలయ్యాయి. ఈ దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందేలా చేశారు.  రంజిత సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.  దాడి చేసిన వారిని వదిలిపెట్టనని ఆమె హెచ్చ‌రించారు. దీనిపై పోలీసులు విచారణ జ‌రుపుతున్నార‌ని ఆమె చెప్పారు. రాత్రి స‌మ‌యంలో దాడి జ‌ర‌గ‌డంతో నిందితులను గుర్తించలేకపోయాన‌ని తెలిపారు.
Go Back to Shorts
mp
Viral Videos
Rajasthan
Crime News

More Telugu News