Rashmika Mandanna: అవకాశం వస్తే ప్రభాస్ తో డేటింగ్ కు వెళ్తా: రష్మిక మందన్న

Will go for date with Prabhas says Rashmika Mandanna
  • సౌతిండియా స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన రష్మిక
  • బాలీవుడ్ లోకి సైతం ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ
  • ప్రభాస్ కు తాను పెద్ద ఫ్యాన్ నని చెప్పిన ముద్దుగుమ్మ 
శాండల్ వుడ్ నుంచి టాలీవుడ్ లో అడుగుపెట్టిన తర్వాత కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న పెద్ద స్టార్ గా మారిపోయింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా అవతరించింది. 25 ఏళ్ల ఈ భామ తెలుగులోనే కాదు, తమిళంలో సైతం వరుస ఆఫర్లు కోట్టేస్తూ... మోస్ట్ డిమాండింగ్ యాక్ట్రెస్ గా మారిపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సినీ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే విషయాన్ని వెల్లడించింది.

మీరు డేటింగ్ కు వెళ్లాలనుకుంటే ఏ హీరోతో వెళ్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ... తెలుగు స్టార్ హీరోతో తాను డేట్ కు వెళ్లాలనుకుంటున్నానని చెప్పింది. ఆ స్టార్ ఎవరో కాదు... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. తనకు అవకాశం వస్తే.. ఏదో ఒకరోజు ప్రభాస్ తో డేట్ కు వెళ్తానని రష్మిక తెలిపింది. ప్రభాస్ కు తాను పెద్ద ఫ్యాన్ నని చెప్పింది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. ఇదే  సమయంలో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. 'మిషన్ మజ్ను' సినిమా ద్వారా ఉత్తరాదికి పరిచయం కాబోతోంది.
Rashmika Mandanna
Tollywood
Date
Prabhas

More Telugu News