ప్ర‌తి కొత్త‌ విష‌యాన్ని ఆయ‌న నుంచి తెలుసుకునేవాడిని: బీఏ రాజు మృతి ప‌ట్ల చిరంజీవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్ర‌తి కొత్త‌ విష‌యాన్ని ఆయ‌న నుంచి తెలుసుకునేవాడిని: బీఏ రాజు మృతి ప‌ట్ల చిరంజీవి

chiranjeevi mourns ba raju death
  • బీఏ రాజు పేరు తెలియ‌ని వ్య‌క్తి సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉండ‌రు
  • షూటింగ్ స్పాట్‌లోకి వ‌చ్చి నాతో స‌ర‌దాగా ముచ్చ‌టిం‌చేవారు
  • ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాను
ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో బీఏ రాజు గుండెపోటుతో మరణించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. బీఏ రాజు పేరు తెలియ‌ని వ్య‌క్తి సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉండ‌ర‌ని ఆయ‌న చెప్పారు. మ‌ద్రాసులో ఉన్న‌ప్పుడు సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఆయ‌న త‌న‌తో షేర్ చేసుకునే వార‌ని అన్నారు. ప్ర‌తి కొత్త విష‌యాన్ని ఆయ‌న నుంచి తెలుసుకునే వాడిన‌ని చెప్పారు. షూటింగ్ స్పాట్‌లోకి వ‌చ్చి త‌నతో ఆయ‌న చాలా స‌ర‌దాగా ముచ్చ‌టిం‌చేవార‌ని తెలిపారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు.

            
Chiranjeevi
ba raju
Tollywood

More Telugu News