Andhra Pradesh: రఘురామ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఏపీ సర్కారు

AP Govt files counter affidavit against Raghurama bail plea in Supreme Court
షార్ట్స్‌లో చూడండి
ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం కౌంటర్ వేసింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని రాష్ట్ర ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్ లో ఆరోపించింది. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని తెలిపింది వాక్ స్వాతంత్ర్యం పేరుతో హద్దు మీరకూడదని, కానీ రఘురామకృష్ణరాజు అతిక్రమించారని వివరించింది.

ప్రజల మధ్యన చీలికలు తెచ్చే ప్రయత్నాలు సరికాదని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటనలు, వ్యాఖ్యలు బాగా పరిశీలించాకే కేసు నమోదు చేశామని వివరించింది. రఘురామ బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని సుప్రీంకోర్టుకు విన్నవించింది.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Supreme Court
Counter Affidavit
Raghu Rama Krishna Raju
Bail Petition

More Telugu News