ముందుచూపు లేకపోవడం, నాయకత్వలేమి.. దేశంలో కరోనా వ్యాప్తికి ఈ రెండే కారణం: రఘురామ రాజన్
- ప్రపంచంలో ఏ జరుగుతుందో గమనించి ఉన్నా సరిపోయేది
- వైరస్‌ను జయించేశామని ప్రకటించేశారు
- వ్యాక్సినేషన్ నెమ్మదిగా జరుగుతుండడం కూడా ఓ కారణం
వైరస్‌పై మనం విజయం సాధించేశామని ప్రకటనలు గుప్పించేశారని, కానీ ప్రపంచంలో ఏం జరుగుతోందో గుర్తించి ఉంటే వైరస్ మళ్లీ విజృంభిస్తుందన్న విషయాన్ని గుర్తించగలిగి ఉండేవారని రాజన్ అన్నారు. మరోవైపు, వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతుండడం కూడా వైరస్ వ్యాప్తికి గల కారణాల్లో ఒకటన్నారు. కాగా, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా గతంలో పనిచేసిన రఘురామ రాజన్ ప్రస్తుతం షికాగో యూనివర్సిటీలో ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.