సెక్రటేరియట్ లో ఇప్పటికే ఐదుగురు మరణించారు... అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు: అశోక్ బాబు
- ఏపీలో కరోనా బీభత్సం
- సచివాలయంలోనూ మృత్యుఘంటికలు
- వందల మంది ఉద్యోగులు ఆసుపత్రులపాలయ్యారన్న అశోక్ బాబు
- ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లేదని ఆవేదన
- సీఎం జగన్ కు బహిరంగ లేఖ
టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని, తద్వారా ఉపాధ్యాయులను, ఇన్విజిలేటర్లను కరోనా ముప్పు నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు పనిచేసే ప్రదేశాల్లో పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. కరోనాతో ఆసుపత్రుల్లో చేరే ఉద్యోగులకు ప్రత్యేక బెడ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.