కరోనా బారిన పడ్డ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కరోనా బారిన పడ్డ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్

Don Chota Rajan tests with Corona positive
  • తీహార్ జైల్లో ఉన్న చోటా రాజన్
  • జైల్లోనే ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్న వైద్యులు
  • సాయుధ పోలీసుల పర్యవేక్షణలో చికిత్స
అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఛోటా రాజన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని... ఆయనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని జైలు అధికారులు ప్రకటించారు. జైల్లో ఉన్న ఆసుపత్రి ప్రత్యేక వార్డులోనే రాజన్ కు చికిత్స అందిస్తున్నారు.

సాయుధ పోలీసుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నామని జైలు అధికారులు తెలిపారు. తీహార్ జైల్లో వేల సంఖ్యలో ఖైదీలు ఉంటారనే విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి తీహార్ జైల్లో కూడా ఖైదీలు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.
Chota Rajan
Corona Virus

More Telugu News