హరీశ్ శంకర్ తో మరోసారి మాస్ మహారాజ్!
- రవితేజ 'షాక్'తో హరీశ్ శంకర్ పరిచయం
- ఇద్దరి కాంబినేషన్లో 'మిరపకాయ్' హిట్
- మరోసారి ఓకే చెప్పిన రవితేజ
అయితే క్రిష్ .. సాగర్.కె చంద్ర దర్శకత్వంలోని సినిమాలను పూర్తిచేసిన తరువాతనే, హరీశ్ శంకర్ తో సెట్స్ పైకి పవన్ వస్తాడు. అందుకు దాదాపు ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అందువలన ఈ లోగా మరో సినిమాను చేయాలని హరీశ్ శంకర్ నిర్ణయించుకున్నాడట. ఆయన ఒక కథను రవితేజకు వినిపించడం .. అటువైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయాయని అంటున్నారు. హరీశ్ శంకర్ పరిచయమైందే రవితేజ 'షాక్' సినిమాతో. తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో 'మిరపకాయ్' హిట్ ఉంది. మొత్తానికి మరో మాస్ మసాలా మూవీ రానుందన్న మాట!