'సలార్' కోసం సిద్ధమైన భారీ సెట్లు!
- పూర్తిస్థాయి రఫ్ లుక్ తో ప్రభాస్
- సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్
- హైదరాబాద్ .. గుజరాత్ లలో షూటింగ్
రొమాంటిక్ లవ్ స్టోరీగా 'రాధేశ్యామ్' నిర్మితమవుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఇక భారీ యాక్షన్ మూవీగా 'సలార్' రూపొందుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పూర్తి రఫ్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీ సెట్ వేశారు. అలాగే గుజరాత్ లోను ఒక భారీ సెట్ వేశారు. ఇప్పుడు ఈ రెండు సెట్లు షూటింగుకు సిద్ధంగా ఉన్నాయి. వచ్చేనెలలో హైదరాబాద్ లో .. ఆ తరువాత షెడ్యూల్ ను గుజరాత్ లో చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా శ్రుతిహాసన్ అలరించనుంది.