హరీశ్ శంకర్ మూవీలో తండ్రీకొడుకులుగా పవన్?
- గతంలో హిట్ కొట్టిన 'గబ్బర్ సింగ్'
- ఇద్దరి కాంబినేషన్లో మరో మూవీ
- అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం
ప్ర్రస్తుతం సాగర్ .కె చంద్ర దర్శకత్వంలో పవన్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ చేస్తున్నాడు. అదే సమయంలో ఆయన క్రిష్ దర్శకత్వంలో ' హరిహర వీరమల్లు' సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత హరీశ్ శంకర్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో పవన్ ఎలా కనిపించనున్నాడా అని అభిమానులు కుతూహలాన్ని కనబరుస్తున్నారు. ఈ సినిమాలో పవన్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నాడట. ఒక పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనేది మరోటాక్. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమా, అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.