ఉగాది సందర్భంగా తెలుగులో ట్వీట్లు చేసిన రాష్ట్రపతి, ప్రధాని!

Kovind and Modi Wishes in Telugu
  • నేడు నూతన సంవత్సరాది
  • ట్విట్టర్ లో అభినందనలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని
  • భోగభాగ్యాలతో వర్ధిల్లాలని కోరిన మోదీ
నేడు తెలుగు రాష్ట్రాల ప్రజలు కొత్త సంవత్సరాది ఉగాదిని ఉత్సాహంగా జరుపుకుంటున్న వేళ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో తెలుగులో ట్వీట్లు చేశారు. ప్రజలకు శుభాభినందనలు తెలిపారు.

"తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మన సోదర సోదరీమణులకూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను" అని రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

"అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను" అని నరేంద్ర మోదీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
Go Back to Shorts
Ramnath Kovind
Narendra Modi
Twitter
Telugu

More Telugu News