ఉత్కంఠను రేకెత్తిస్తోన్న 'మేజర్' టీజర్!
- అడివి శేష్ హీరోగా 'మేజర్'
- ఉద్వేగభరితమైన సన్నివేశాలు
- జూలై 2వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్, ఆకట్టుకునేలా ఉంది. ఒక వైపు ప్రేమ .. మరో వైపు దేశభక్తి .. ఇంకో వైపు త్యాగం .. ఇలా కథానాయకుడి జీవితాన్ని మూడు కోణాల్లో ఆవిష్కరిస్తూ అందించిన విజువల్స్ మనసుకు పడుతున్నాయి. ఫొటోగ్రఫీ బాగుందనే విషయం విజువల్స్ ను బట్టి అర్థమయిపోతోంది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచాలనే ప్రయత్నంలో దర్శక నిర్మాతలు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.