"కదులు కదులు కదులు"... వకీల్ సాబ్ చిత్రం నుంచి రోమాంఛక గీతం ఇదిగో!
Add ap7am to your home Screen

"కదులు కదులు కదులు"... వకీల్ సాబ్ చిత్రం నుంచి రోమాంఛక గీతం ఇదిగో!

Another song released from Vakeel Saab
  • పవన్ హీరోగా 'వకీల్ సాబ్' చిత్రం
  • ఇప్పటివరకు విడుదలైన పాటలన్నీ హిట్
  • 'కదులు కదులు' పాటకు కూడా విశేష స్పందన
  • తమన్ బాణీలకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం
పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో నటించిన 'వకీల్ సాబ్' చిత్రం నుంచి ఓ ప్రబోధాత్మక గీతం విడుదలైంది. 'కదులు కదులు కట్లు తెంచుకుని కదులు' అంటూ సాగే ఈ రోమాంఛక గీతాన్ని చిత్రయూనిట్ ఆన్ లైన్ లో రిలీజ్ చేసింది.

తమన్ బాణీలకు సీనియర్ లిరిక్ రైటర్ సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. ఇప్పటికే 'వకీల్ సాబ్' నుంచి విడుదలైన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. ఈ 'కదులు కదులు' సాంగ్ కు కూడా విశేష స్పందన లభిస్తోంది. సుద్దాల అశోక్ తేజ కలం నుంచి జాలువారిన ఈ స్ఫూర్తిదాయక గీతం తమన్ ఆర్కెస్ట్రయిజేషన్ లో మరింత ఊపు తెచ్చేదిగా ఉంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్ జంటగా నటించిన 'వకీల్ సాబ్' ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు.
Vakeel Saab
Kadhulu Kadhulu
New Song
Pawan Kalyan
Thaman
Suddala Ashok Teja

More Telugu News