నేడు రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు... తన డెత్ డే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్!
- శుభాకాంక్షలు తెలుపుతున్న పలువురు
- నా ఆయుష్షులో మరో ఏడు తగ్గిపోయింది
- ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన వర్మ
"నేడు నా పుట్టిన రోజు కాదు. ఇది నిజానికి నా డెత్ డే. ఎందుకో తెలుసా? నా ఆయుష్షులో మరో సంవత్సరం తగ్గిపోయింది" అంటూ ఈ ఉదయం ఆయన ట్వీట్ చేశారు. దీనికి ఏడుపు మొహం ఎమోజీని సైతం తగిలించారు. వర్మ ట్వీట్ ను చూసిన పలువురు వెరైటీగా స్పందిస్తున్నారు. ఆర్జీవీ రూటే సపరేటని కామెంట్లు వస్తున్నాయి.