రష్మిక మందన్నకు నాగార్జున పుష్ అప్ ఛాలెంజ్..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రష్మిక మందన్నకు నాగార్జున పుష్ అప్ ఛాలెంజ్..!

Nagarjuna WildDogPushUpChallenge to Rashmika mandhana
  • నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోన్న వైల్డ్‌ డాగ్‌ పుష్‌అప్‌ ఛాలెంజ్‌
  • స్వీకరించిన రష్మిక మందన్న 
  • మరోసారి రష్మికకు కొత్త ఛాలెంజ్ విసిరిన నాగార్జున
  • ‌తాను చేసిన సమయం కంటే ఎక్కువసేపు చేయాలని సవాల్‌
సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు 'వైల్డ్‌ డాగ్'‌ పుష్‌ అప్‌ ఛాలెంజ్‌ హల్‌చల్‌ చేస్తోంది. ఈ క్రమంలో సోష‌ల్ ‌మీడియాలో చురుకుగా ఉంటూ అభిమానుల్లో జోష్ నింపే క‌న్న‌డ భామ ర‌ష్మిక మందన్నకు ఈ ఛాలెంజ్‌పై కన్ను పడింది. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లే ఈ బ్యూటీ సవాల్‌ను స్వీకరించింది. కొన్ని సెకన్ల పాటు పుష్‌అప్‌ పొజిషన్‌లో ఉండి దానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది.

రష్మిక వీడియోను టాలీవుడ్‌ స్టార్ నాగార్జున చూశారు. ఆయన కూడా పుష్‌అప్‌ పొజిషన్‌లో చాలా సేపు ఉన్నారు. దాన్ని బీట్‌ చేయాలంటూ రష్మికకు మరో ఛాలెంజ్‌ విసిరారు. ‘యూ నీడ్‌ టు బీట్‌ దిస్‌ డియర్’‌ అంటూ తన పోస్ట్‌కి ఆమె ఖాతాను ట్యాగ్‌ చేశారు. ఆయన చేసిన పుష్‌ అప్ వీడియో‌ని కూడా జత చేశారు.

నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన వైల్డ్ డాగ్ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో వైల్డ్ డాగ్ పుష్ అప్ ఛాలెంజ్ లీగ్‌ నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇప్ప‌టికే వైల్డ్ డాగ్ యాక్ట‌ర్ అలీ రెజాతోపాటు ప‌లువురు ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.‌
Nagarjuna
Tollywood
Rashmika Mandanna

More Telugu News