Rashi Khanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Rashi Khanna to pair up with Raviteja again
షార్ట్స్‌లో చూడండి
*  రవితేజ సరసన రాశీఖన్నా మరోసారి జతకట్టనుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందే సినిమాలో కథానాయికగా రాశీఖన్నాను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇది కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది.
*  ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించే భారీ చిత్రం షూటింగ్ జూన్ నెలాఖరు నుంచి జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో ఈ షూటింగ్ ఎక్కువ భాగం నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇందుకోసం భారీ సెట్స్ కూడా వేస్తున్నారట. ఇందులో బాలీవుడ్ భామ దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తుంది.
*  ప్రస్తుతం 'శ్యామ్ సింగరాయ్' చిత్రంలో నటిస్తున్న నాని.. దీని తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'అంటే సుందరానికి..' అనే చిత్రాన్ని చేస్తాడు. దీని తర్వాత చేయబోయే చిత్రానికి సుకుమార్ వద్ద పనిచేసిన నూతన దర్శకుడు శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తాడు. ఇదిలావుంచితే, నాని తాజా చిత్రం 'టక్ జగదీశ్' ఏప్రిల్ 23న విడుదల అవుతోంది.
*  ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగమార్తాండ' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. మే మూడవ వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ కీలక పాత్రలు పోషించారు.
Go Back to Shorts
Rashi Khanna
Raviteja
Prabhas
Deepika Padukone
Nani

More Telugu News