డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న 'వకీల్ సాబ్'
పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. ఈ చిత్రం డబ్బింగ్ పనులు నేటితో పూర్తయ్యాయి. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. బాలీవుడ్ హిట్ చిత్రం 'పింక్' కు రీమేక్ గా రూపుదిద్దుకుంటున్న 'వకీల్ సాబ్' చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది.
'పింక్' లో లెజెండరీ అమితాబ్ బచ్చన్ పోషించిన న్యాయవాది పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ పోషించారు. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ కథానాయిక కాగా, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలకపాత్రధారులు. తమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందాయి.