అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా అంతుచూసిన ముంగిస... వీడియో వైరల్
- పాము, ముంగిస మధ్య జాతి వైరం
- పరస్పరం పోరాడే వన్యప్రాణులు
- కింగ్ కోబ్రాతో ముంగిస పోరు
- తప్పించుకునేందుకు చెట్టెక్కిన పాము
- మెడను దొరకబుచ్చుకున్న ముంగిస
ముంగిసతో పోరు సందర్భంగా నేలకు తక్కువ ఎత్తులో ఉన్న ఓ చెట్టుకొమ్మపైకి కింగ్ కోబ్రా చేరగా, ముంగిస ఎంతో నేర్పుగా ఆ పాము మెడను నోట కరుచుకుని పొదల్లోకి లాక్కుని వెళ్లింది. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. కింగ్ కోబ్రా తనను కాటు వేయకుండా, ముంగిస కచ్చితంగా దాని మెడను చేజిక్కించుకోవడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.