టీమిండియాతో చివరి టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లండ్
- అహ్మదాబాద్ లో ఐదో టీ20
- సిరీస్ లో రెండేసి మ్యాచ్ లు నెగ్గిన భారత్, ఇంగ్లండ్
- సిరీస్ విజేతను తేల్చనున్న చివరి మ్యాచ్
- టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- కేఎల్ రాహుల్ ను జట్టు నుంచి తప్పించిన భారత్
- నటరాజన్ కు చోటు
కాగా ఈ మ్యాచ్ కోసం టీమిండియా కేఎల్ రాహుల్ ను తప్పించింది. యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ తుదిజట్టులోకి వచ్చాడు. ఇక, రోహిత్ శర్మకు జోడీగా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు ఉన్నాయి. అటు ఇంగ్లండ్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు.