Mohan Babu: 'శాకుంతలం'లో మోహన్ బాబు కీలక పాత్ర?

Mohan Babu to play key role in Shakuntalam
షార్ట్స్‌లో చూడండి
ఆమధ్య 'రుద్రమదేవి' వంటి చారిత్రాత్మక కథా చిత్రాన్ని రూపొందించి ప్రశంసలందుకున్న ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఇప్పుడు 'శాకుంతలం' పేరిట పౌరాణిక కథను తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. మహాభారతం, ఆదిపర్వంలోని ప్రేమకథ ఆధారంగా  రూపొందుతున్న ఈ చిత్రంలో అందాల కథానాయిక సమంత శకుంతలగా నటిస్తుండగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రను పోషిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించారు.

ఇక ఇందులో మరో కీలక పాత్రను ప్రముఖ నటుడు మోహన్ బాబు పోషించనున్నట్టు తెలుస్తోంది. కథలో కీలకమైన దూర్వాస మహాముని పాత్రను ఆయన పోషించనున్నారని అంటున్నారు. ఈ విషయంలో ప్రస్తుతం ఆయనతో చిత్ర బృందం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఒకవేళ మోహన్ బాబు నటించడం అన్నది ఖరారైతే కనుక ఈ ప్రాజక్టుకి మరింత క్రేజ్ వస్తుందనే చెప్పచ్చు. మణిశర్మ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం భారీ సెట్స్ ను వేస్తున్నారు.
Go Back to Shorts
Mohan Babu
Samanta
Gunashekhar
Dev Mohan

More Telugu News