'చిరంజీవి అంకుల్ వల్లనే ఇది సాధ్యమైంది'.. ఆసక్తికర విషయం చెప్పిన మంచు లక్ష్మి
- సిక్కిం టూర్‌కు మోహన్ బాబును తీసుకెళ్లిన చిరు
- చిరు, మోహన్ బాబుల ఫొటో పోస్ట్ చేసిన లక్ష్మి
- ఏదో ఒక రోజు తాము కూడా జాయిన్ అవుతామని వ్యాఖ్య
'మెగాస్టార్ చిరంజీవి అంకుల్ వీకెండ్ ట్రిప్‌కు నాన్నను దగ్గరుండి ఒప్పించి మరీ తీసుకెళ్లాడ'ని ఆమె చెప్పింది. ఈ విషయంలో తనకు కొంత ఈర్ష్యగా ఉందని తెలిపింది. అయితే, వారిద్దరూ హాయిగా ట్రిప్‌కు వెళ్లినందుకు సంతోషిస్తున్నానని చెప్పింది.
ఇటువంటి ట్రిప్‌లోనే ఏదో ఒక రోజు తాము కూడా జాయిన్ అవుతామని తెలిపింది. 'సిక్కింలో బిల్లారంగా' అంటూ మంచు మనోజ్ కూడా చిరు, మోహన్ బాబుల ఫొటోను పోస్ట్ చేశాడు.