Revanth Reddy: ఐటీఐఆర్ పై జంతర్ మంతర్ వద్ద దీక్షకు మేం సిద్ధం... మీరు సిద్ధమా?: కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy open letter to KTR
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ఐటీ మంతి కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఐటీఐఆర్, విభజన చట్టం హామీలు, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా అంశాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు తాము సిద్ధమని, మీరు కూడా సిద్ధమా? అని సవాల్ విసిరారు. దేశ రాజధానిలో దీక్షతో ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచుదామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

తన సవాల్ కు కేటీఆర్ స్పష్టమైన సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. మీ దొడ్లో కుక్కలతో మొరిగించే ప్రయత్నం చేయొద్దు అని స్పష్టం చేశారు. తన సవాల్ ను కేటీఆర్ స్వీకరించకుంటే మోదీ తొత్తులుగా, శాశ్వతంగా తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
Go Back to Shorts
Revanth Reddy
KTR
Protest
ITIR
New Delhi
Narendra Modi
Telangana

More Telugu News