సుప్రీంకోర్టులో ‘హైబ్రిడ్’ విధానంలో విచారణ!
- భౌతిక విచారణతో పాటు ఆన్ లైన్ వాదనలు
- మంగళ, బుధ, గురువారాలు కేటాయింపు
- చివరి దశలో ఉన్న కేసులకు వర్తింపు
- ఎలా విచారించాలన్నది ధర్మాసనం ఇష్టం
- సోమ, శుక్రవారాల్లో కేవలం ఆన్ లైన్ విచారణ
‘హైబ్రిడ్’ విధానంలో భాగంగా ఇటు భౌతిక విచారణతో పాటు (ఫిజికల్ హియరింగ్స్) ఆన్ లైన్ విచారణను కొనసాగించాలని నిర్ణయించింది. మార్చి 15 నుంచి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది. అందులో భాగంగా మంగళ, బుధ, గురువారాల్లో చివరి దశలో ఉన్న కేసులను రెండు పద్ధతుల్లో విచారించనుంది.
అందుబాటులో ఉన్న కోర్టు గదులు, విచారణకు వచ్చే పార్టీల సంఖ్యను బట్టి ధర్మాసనం ఏ విధానంలో విచారించాలో నిర్ణయిస్తుందని రిజిస్ట్రీ పేర్కొంది. సోమవారం, శుక్రవారం మాత్రం పూర్తిగా ఆన్ లైన్ లోనే కేసులను విచారిస్తుందని తెలిపింది.