మేడారం జాతరలో కలకలం రేపిన కరోనా
- మేడారం మినీ జాతరకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు
- ముగ్గురు దేవాదాయశాఖ సిబ్బందికి కరోనా
- పలువురిలో కరోనా లక్షణాలు
దేవాదాయశాఖకు చెందిన ముగ్గురు సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరికొందరిలో కోవిడ్ లక్షణాలు కనిపించాయి. దీంతో వారందరినీ క్వారంటైన్ కు తరలించారు. వీరితో సన్నిహితంగా మెలిగిన వారందరూ హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తుల్లో ఎంత మందికి కరోనా ఉందనే అనుమానాలు అధికారులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. భక్తులందరూ తప్పని సరిగా మాస్కులు ధరించాలని అధికారులు కోరుతున్నారు.