బీజేపీ ఛ‌‌లో మంథ‌ని కార్య‌క్ర‌మం ప్రారంభం!

chalo manthani begins
  • ఇటీవ‌ల న్యాయవాద దంపతుల హ‌త్య‌
  • బీజేపీ లీగల్ సెల్ ఛ‌లో మంథ‌ని కార్య‌క్ర‌మం
  • బ‌య‌లుదేరిన‌ 150 మంది న్యాయవాదులు  
ఇటీవ‌ల న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, పీవీ నాగమణి దారుణహత్యకు గురైన విష‌యం తెలిసిందే. దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న బీజేపీ తెలంగాణ నేత‌లు ఛ‌లో మంథ‌ని కి పిలుపునిచ్చారు. బీజేపీ లీగల్ సెల్ ఈ కార్య‌క్ర‌మాన్ని జ‌రుపుతోంది. న్యాయ‌వాద‌ దంపతుల హత్యపై కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ)తో విచార‌ణ జ‌రిపించాల‌ని  డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టుల నుండి ఛ‌లో మంథనికి కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే, బీజేపీ  నేత రాజాసింగ్  ప్రారంభించారు. ఇందులో భాగంగా వామనరావు కుటుంబాన్ని పరామర్శించి,  వారికి భరోసా కల్పిస్తారు.  ఇందుకోసం మూడు బస్సుల్లో దాదాపు 150 మంది న్యాయవాదులు మంథ‌నికి బయల్దేరారు.
Go Back to Shorts
BJP
Crime News
Telangana

More Telugu News