నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబోలో కొత్త చిత్రం ప్రారంభం
- హైదరాబాదులో పూజా కార్యక్రమాలు
- క్లాప్ కొట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్
- నాగ్ ను కొత్తగా చూపించనున్న ప్రవీణ్ సత్తారు
- త్వరలో ఇతర తారాగణం వెల్లడి
- మరికొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
నాగార్జున లాక్ డౌన్ ముగిశాక తన చిత్రాల స్పీడు పెంచారు. వైల్డ్ డాగ్, బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్ర షూటింగ్ పూర్తి చేసుకున్నారు. కాగా, తాజా చిత్రంలో నాగ్ ను వినూత్నంగా చూపించేందుకు ప్రవీణ్ సత్తారు చాలా హోంవర్క్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పక్కాగా స్క్రిప్టు వర్క్ కూడా పూర్తి కావడంతో, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.