'నాట్యం' సినిమా టీజర్‌ను విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్
- కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు నటిస్తోన్న సినిమా నాట్యం
- చక్కని సంగీతాన్ని జోడిస్తూ టీజర్
- కీలక పాత్రల్లో నటిస్తోన్న కమల్ కామరాజు, రోహిత్ బెహల్
నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడమని ఆదిత్య మేనన్ ఓ పాపకు చెబుతాడు. నువ్వు పాటలు కూడా పాడతావా? అంటూ హీరోయిన్‌ను హీరో అడుగుతాడు. ఈ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పకుండా కొబ్బరికాయ కొడుతుంది. చక్కని సంగీతాన్ని జోడిస్తూ ఈ టీజర్‌ను కట్ చేశారు.
ఈ సినిమాకు రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కమల్ కామరాజు, రోహిత్ బెహల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన విడుదల చేసిన విషయం తెలిసిందే.