గోవాలో వర్మను కలిసిన అరియానా
Add ap7am to your home Screen

గోవాలో వర్మను కలిసిన అరియానా

Ariana meets Ram Gopal Varma in Goa
  • బిగ్ బాస్ షోలో ఆకట్టుకున్న అరియానా
  • నాలుగో స్థానంతో బయటకు వచ్చిన వైనం
  • గోవా టూర్ లో ఉన్న అరియానా, అవినాశ్, విష్ణుప్రియ
యాంకర్ గా ఉన్న అరియానా... ఆ తర్వాత బిగ్ బాస్ లో అడుగుపెట్టి టాప్ ఫైవ్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆమె బిగ్ బాస్ లోకి వెళ్లడానికి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మనే కారణం అని చెప్పొచ్చు. గతంలో వర్మను అరియానా ఇంటర్వ్యూ చేసింది. 'ఏ అమ్మాయిని చూస్తే మీకు వావ్ అనిపిస్తుంది' అని అరియానా అడిగితే... 'నువ్వే' అని సమాధానమిచ్చి అరియానాకు వర్మ షాకిచ్చాడు. అంతేకాదు... నిన్ను బికినీలో చూడాలని ఉందని సంచలన కామెంట్ చేశాడు. ఈ ఇంటర్వ్యూ అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అరియానా ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె బిగ్ బాస్ లో అడుగుపెట్టింది.

బిగ్ బాస్ లో సైతం అరియానా ప్రేక్షకులను కట్టి పడేసింది. బోల్డ్ గా కనిపిస్తూ, కంటెస్టెంట్స్ తో పోటీ పడుతూ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది. చివరకు నాలుగో స్థానంతో ఆమె బయటకు వచ్చింది. తాజాగా వర్మను అరియానా కలిసింది. ఎక్కడో కాదు.. టూర్టిస్ట్ డెస్టినేషన్ గోవాలో. విష్ణుప్రియ, అవినాశ్ తో పాటు అరియానా గోవాకు వెళ్లింది. పనిలో పనిగా అక్కడే ఉన్న వర్మను అరియానా కలిసింది. ఈ సందర్భంగా వర్మతో దిగిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు... 'నాతో విలువైన సమయం గడిపినందుకు థాంక్యూ సార్' అని పేర్కొంది.
Ariana
Ram Gopal Varma
Goa

More Telugu News