Uttar Pradesh: పాయిజన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్న బీఎస్పీ నేత హర్ వీర్!

BSP Leader Sucide with Poison
షార్ట్స్‌లో చూడండి
బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన నేత హర్ వీర్, విషాహారం తిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. యూపీలోని తహసీల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, బదాయూ జిల్లా పరిధిలోని సహస్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో నివసిస్తున్న హర్ వీర్ పదేళ్ల క్రితం ఓ భూమిని కొనుగోలు చేశారు.దాన్ని క్రమబద్దీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న అతను, పలుమార్లు ఇప్పటికే ఎస్డీఎం‌ను కలిశారు.

పదేపదే తిప్పించుకోవడం మినహా వారు మరేమీ చేయకపోవడంతో ఎస్డీఎంతో గొడవకు కూడా దిగారు. ఈ నేపథ్యంలోనే హర్ వీర్ ను సోమవారం నాడు రావాలని అధికారులు చెప్పడంతో, అప్పటికే విసిగిపోయిన ఆయన, విషం కలిపిన ఆహారం తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు హర్ వీర్ ను ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు.

Go Back to Shorts
Uttar Pradesh
Harveer
Poison
Sucide

More Telugu News