RRR: క్లైమాక్స్ కు ముందు ప్రాక్టీసు... ఆర్ఆర్ఆర్ సెట్స్ పై రామ్ చరణ్, ఎన్టీఆర్ సన్నాహాలు

Practice session for RRR Climax shoot
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఓ పర్ఫెక్షనిస్టు అన్న సంగతి తెలిసిందే. నటీనటుల నుంచి నటనను రాబట్టుకోవడం నుంచి టెక్నీషియన్ల నుంచి మెరుగైన అవుట్ పుట్  వచ్చే వరకు ఆయన విశ్రమించరు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా అదే ఫార్ములా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి క్లైమాక్స్ షూట్ చేస్తుండగా, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కోసం ప్రాక్టీసు సెషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రాక్టీసు సెషన్ కు విచ్చేసిన ఎన్టీఆర్, చరణ్ ల ఫొటోలను ఆర్ఆర్ఆర్ చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం యావత్ భారతదేశ చిత్రపరిశ్రమ వేచిచూస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా భట్, ఒలీవియో మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Go Back to Shorts
RRR
Climax
Practice Session
Ramcharan
Junior NTR
Tollywood

More Telugu News