తన భర్త అదృశ్యమయ్యాడంటూ శిరోముండనం బాధితుడు ప్రసాద్ భార్య ఫిర్యాదు!
- గత ఏడాది ప్రసాద్‌కు పోలీసు స్టేషన్‌లో శిరోముండనం
- ఇసుక రేవు వివాదంలో చర్యలకు పాల్పడ్డ ఎస్సై
- వేధింపులు ఎదురవుతున్నాయని ప్రసాద్ మనస్తాపం
- రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వైనం
రెండు రోజుల క్రితం ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదని తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని సీతానగరం పోలీసులు తెలిపారు. కాగా, తనకు శిరోముండనం చేయాలని చెప్పిన వైసీపీ నాయకులను అరెస్టు చేయాలంటూ గతంలో ప్రసాద్ నిరసన దీక్షకు దిగాడు. అయినప్పటికీ, ఈ కేసు ముందుకు సాగలేదు.
దీంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందాడు. తనకు శిరోముండనం చేయడం పట్ల కొందరు మాటలతో వేధిస్తున్నారని ప్రసాద్ తమకు పదే పదే చెప్పేవాడని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు.