అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నా.. అందుకే బీజేపీలో చేరా: కేరళ మాజీ డీజీపీ
- రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళ చేరుకున్న నడ్డా
- కొచ్చి నుంచి ఓపెన్ టాప్ జీపులో త్రిసూర్‌కు..
- రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన జాకబ్
కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో పార్టీని సమాయత్తం చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న కొచ్చి చేరుకున్నారు. ఈ సందర్భంగా వందలాదిమంది బీజేపీ కార్యకర్తలతో విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ జీపులో నడ్డా త్రిసూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాజీ డీజీపీ జాకబ్ బీజేపీలో చేరారు.