వయసు పెరుగుతున్నా ఏం తగ్గడంలేదు... అబుదాబిలో గేల్ దుమారం!

Gayle blasts in Abhudabi tourney
  • 41 ఏళ్ల వయసులోనూ గేల్ మెరుపులు
  • అబుదాబి టీ10 టోర్నీలో వేగవంతమైన ఫిఫ్టీ
  • 22 బంతుల్లో 84 రన్స్
  • కేవలం 12 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేసుకున్న గేల్
అంతర్జాతీయ క్రికెటర్లకు 35 ఏళ్లకు పైబడితే వారి కెరీర్ చరమాంకంలో ఉన్నట్టే భావించాలి. కానీ వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ అందుకు మినహాయింపు. గేల్ వయసు ఇప్పుడు 41 సంవత్సరాలు. తనతో పాటు అరంగేట్రం చేసినవాళ్లు విశ్రాంతి తీసుకుంటుంటే ఈ కరీబియన్ వీరుడు మాత్రం బ్యాట్ తో చిచ్చరపిడుగల్లే చెలరేగిపోతున్నాడు. అబుదాబిలో జరుగుతున్న టీ10 టోర్నీలో గేల్ ఆకాశమే హద్దులా విరుచుకుపడ్డాడు.

అబుదాబి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్... మరాఠా అరేబియన్స్ జట్టుతో మ్యాచ్ లో కేవలం 22 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. సుడిగాలిలా విజృంభించిన గేల్ 6 ఫోర్లు, 9 భారీ సిక్సులతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. విశేషం ఏంటంటే... గేల్ ఫిఫ్టీ పూర్తి చేసుకోవడానికి కేవలం 12 బంతులే ఆడాడు. గతంలో ఇదే రికార్డు మహ్మద్ షేజాద్ పేరిట ఉండగా, 12 బంతుల్లో 50 రన్స్ చేసి ఆ రికార్డును గేల్ సమం చేశాడు.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన మరాఠా అరేబియన్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లకు 97 పరుగులు చేసింది. ఇక లక్ష్యఛేదనలో గేల్ సునామీ వేగంతో ఆడడంతో టీమ్ అబుదాబి ఆ లక్ష్యాన్ని 5.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ గా బరిలో దిగిన గేల్ 84 పరుగులతో అజేయంగా నిలిచాడు.
Go Back to Shorts
Chris Gayle
Abu Dhabi
T10
Fastest Fifty

More Telugu News