నల్లగా వున్నావు, ఎలా రాణిస్తావని అప్పట్లో అంతా అడిగేవారు: రోజా

Film industry is like current says Roja
  • ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నల్లగా ఉన్నావని అనేవారు
  • తమిళ పరిశ్రమ నాకు పుట్టినిల్లు వంటిది
  • నల్లగా వున్నా నన్ను మేకప్ మెన్లు అందంగా చూపించారు
తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటిగా కొనసాగిన వారిలో నేటి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఒకరు. కొన్ని సంవత్సరాల పాటు ఆమె తన అందం, అభినయంతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే, తన శరీర రంగు గురించి ఆమె తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'నల్లగా ఉన్నావు... సినిమాలలో ఎలా రాణిస్తావు?' అని తాను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో అందరూ తనను కామెంట్ చేసేవారని... అయితే మేకప్ మెన్లు తనకు కాస్త రంగు వేసి చాలా అందంగా చూపించారని ఆమె చెప్పారు. సౌతిండియా సినీ, టీవీ మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన కార్యక్రమానికి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె భర్త సెల్వమణి కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, మేకప్ ఆర్టిస్టుల కారణంగానే తాను అందంగా కనిపించానని చెప్పారు. తమిళ సినీ పరిశ్రమ తనకు పుట్టినిల్లు వంటిదని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పారు. దివంగత జయలలితను తలచుకుంటే ఎంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయని తెలిపారు.  
Go Back to Shorts
Roja
YSRCP
Tollywood
Makeup

More Telugu News