జగన్‌ను సోము వీర్రాజుగారు ఎప్పుడు విమర్శించినా చంద్ర‌బాబునూ విమ‌ర్శిస్తారు: వ‌ర్ల రామ‌య్య‌

varla ramaiah slams somu veerraju
  • చంద్రబాబు అధికారం విడిచి రెండేళ్లు అయింది
  • జగన్ ను తమలపాకుతో, చంద్రబాబును తలుపు చెక్కతో కొడతారు
  • ఏమిటో ఈ గుట్టు? ఆయనే విప్పాలి  
బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అధ్యక్షుడు సోము వీర్రాజు త‌మ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై చేస్తోన్న విమ‌ర్శ‌ల ప‌ట్ల టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య కౌంట‌ర్ ఇచ్చారు. చంద్ర‌బాబు నాయుడు ఏపీ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి దిగిపోయి దాదాపు రెండేళ్లు కావ‌స్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న‌పై సోము వీర్రాజు విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం ఏంట‌ని వ‌ర్ల రామ‌య్య ట్వీట్ చేశారు.

'బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుగారు ఎప్పుడు ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించవలసి వచ్చినా ఆయనతో పాటు చంద్రబాబు గారిని కలిపి విమర్శిస్తారు. చంద్రబాబు అధికారం విడిచి రెండేళ్లు అయింది. విమర్శలో కూడా, జగన్ ను తమలపాకుతో, చంద్రబాబును తలుపు చెక్కతో కొడతారు. ఏమిటో ఈ గుట్టు? ఆయనే విప్పాలి' అని వ‌ర్ల రామ‌య్య పేర్కొన్నారు.
Go Back to Shorts
Varla Ramaiah
Telugudesam
Somu Veerraju

More Telugu News