అపహరణకు గురైన సర్పంచి అభ్యర్థితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
- ఏపీలో పంచాయతీ సమరం
- రాయదుర్గం నియోజకర్గంలో కిడ్నాప్ కలకలం
- కిడ్నాపర్ల వల నుంచి తప్పించుకున్న టీడీపీ నేత
- ధైర్యంగా నామినేషన్ వేయాలన్న చంద్రబాబు
- టీడీపీ అండగా ఉంటుందని హామీ
ఈరన్న తన అపహరణ ఘటనపై చంద్రబాబుకు వివరించారు. పోటీ చేస్తే చంపేస్తామని బెదిరించారని వాపోయారు. ఈ సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. ధైర్యంగా నామినేషన్ వేయాలని ఈరన్నకు సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా టీడీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.