Ganesh: మదనపల్లె ఘటన మరువక ముందే చిత్తూరు జిల్లాలో మరో ఘటన!

మదనపల్లెలో అలేఖ్య, సాయిదివ్య అనే అక్కాచెల్లెళ్ల హత్యలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూఢ విశ్వాసాలు రెండు నిండు ప్రాణాలను బలిదీసుకున్నాయి. ఇప్పుడా ఘటన మరువకముందే ఓ యువకుడి అదృశ్యమైన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది.

గంగవరం మండలానికి చెందిన గణేశ్ డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. తాను దేవుడి వద్దకు వెళుతున్నానంటూ లేఖ రాసి కనిపించకుండా పోయాడు. ఈ నెల 21 నుంచి అతడు ఇంటికి రాకపోవడంతో  తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. మదనపల్లె ఘటన నేపథ్యంలో తమ బిడ్డకు ఏమీ జరగకూడదని వారు ప్రార్థిస్తున్నారు.

కాగా, అదృశ్యమైన యువకుడికి భక్తి భావాలు మెండుగానే ఉన్నా, మరీ మూఢత్వం స్థాయిలో లేవని బంధువులు చెబుతున్నారు. కానీ, మదనపల్లె ఘటనను దృష్టిలో ఉంచుకుని వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Ganesh
Missing
Chittoor District
Police

More Telugu News