అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు మరో షాక్.. యూట్యూబ్ ఖాతా నిరవధికంగా నిలిపివేత
- కేపిటల్ భవనంపై దాడి తర్వాత ట్రంప్ ఖాతాపై నిషేధం
- తమ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయన్న యూట్యూబ్ ప్రతినిధి
- ట్రంప్ సలహాదారు రూడీ చానల్‌పైనా ఆంక్షలు
అలాగే, ట్రంప్ సలహాదారు రూడీ గియులియానీ చానల్‌పైనా ఆంక్షలు విధించింది. తన చానల్ నుంచి డబ్బు సంపాదించగల సామర్థ్యాన్ని యూట్యూబ్ పరిమితం చేసింది. ఈ నెల 6న యూఎస్ కేపిటల్ భవనం వద్ద జరిగిన అల్లర్ల తర్వాత ట్రంప్ చానల్‌ను యూట్యూబ్ నిలిపివేసింది. తాజాగా, ఇప్పుడా నిషేధాన్ని మరింత పొడిగించింది. కాగా, తమ నిర్ణయంపై గియులియానీ 30 రోజుల్లో కోర్టులో సవాలు చేసుకోవచ్చని యూట్యూబ్ ప్రతినిధి తెలిపారు.