నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. యూపీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలని నిర్ణయం!
- వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు
- బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి
- బీహార్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్న జేడీయూ
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని జేడీయూ జాతీయ కమిటీ నిర్ణయించినట్టు తెలిపారు. యూపీలో జరిగిన గత ఎన్నికల్లో తాము పోటీ చేయకపోవడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించినట్టు చెప్పారు.