ఆర్థికమాంద్యం కన్నా కరోనా వల్ల జరిగిన నష్టమే ఎక్కువ: ఐఎల్ఓ
- 2009 నాటి ఆర్థికమాంద్యం కన్నా నాలుగు రెట్ల నష్టం
- ప్రపంచవ్యాప్తంగా 25.5 కోట్ల ఉద్యోగాలు మాయం
- 8.3 శాతానికి పడిపోయిన ప్రజల సంపాదన శక్తి
కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేయడంతో చాలా కంపెనీలు ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఉద్యోగులను తొలగించాయని పేర్కొంది. ఫలితంగా గతేడాది ప్రపంచవ్యాప్తంగా 8.8 శాతం పనిగంటలను కోల్పోయినట్టు వివరించింది. ఇది దాదాపు 25.5 కోట్ల ఉద్యోగాలకు సమానమని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, ఈ కాలంలో ప్రజల సంపాదన శక్తి 8.3 శాతం తగ్గినట్టు ఐఎల్ఓ వివరించింది.