Mudragada Padmanabham: మీ వెనుక ఏదో అదృశ్య శక్తి ఉందనిపిస్తోంది: నిమ్మగడ్డకు ముద్రగడ లేఖ!

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ఎలాగైనా జరిపించాల్సిందేనని భావిస్తూ, తన పని తాను చేసుకుపోతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ను ఉద్దేశించి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాసిన బహిరంగ లేఖ, ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది.

"మీ నిర్ణయాల వెనుక ఏదో అదృశ్య శక్తి ఉండి నడిపిస్తున్నట్టుంది. ఎన్నికల కమిషన్ ఇంత పట్టుదలతో అడుగులు వేస్తుండటాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. ఎవరి ప్రోద్బలంతోనో మీరు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటువంటి మొండి పట్టుదల తగదని భావిస్తున్నాం. కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా తగ్గి, ఉద్యోగులకు వ్యాక్సిన్ అందించిన తరువాత ఎన్నికలు జరపించడానికి అభ్యంతరాలేంటి?" అని తన లేఖలో ముద్రగడ ప్రశ్నించారు.
Mudragada Padmanabham
Nimmagadda Ramesh
EC
Andhra Pradesh
Letter

More Telugu News