సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Shruti Hassan gives clarity on marriage
  • పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కథానాయిక
  • మరో యువదర్శకుడికి చిరంజీవి ఛాన్స్!
  • పోస్ట్ ప్రొడక్షన్ పనులలో 'టక్ జగదీశ్'
  • మహా శివరాత్రికి 'గాలి సంపత్' రాక  
*  ఇప్పట్లో పెళ్లి ప్రసక్తే లేదని అంటోంది కథానాయిక శ్రుతిహాసన్. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తుండగా, ఓ అభిమాని త్వరలో పెళ్లి చేసుకుంటున్నారట, నిజమేనా? అని అడిగితే, ఈ చిన్నది సమాధానం చెబుతూ, అందులో వాస్తవం లేదని, ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేసింది. అన్నట్టు, తాజాగా రవితేజతో కలసి శ్రుతి నటించిన 'క్రాక్' మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
*  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్న విషయం విదితమే. ఇప్పటికే 'ఆచార్య'తో కలిపి నాలుగు సినిమాలు లైన్లో వున్నాయి. ఈ క్రమంలో యువ దర్శకుడు వెంకీ కుడుముల కూడా చిరంజీవితో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. చిరంజీవి కోసం తయారుచేసిన కథను ఆయనకు త్వరలో వినిపించనున్నట్టు తెలుస్తోంది.
*  నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న 'టక్ జగదీశ్' చిత్రం షూటింగ్ ముగింపు దశలో వుంది. మరోపక్క, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  శ్రీవిష్ణు, లవ్ లీ సింగ్ జంటగా రూపొందుతున్న 'గాలి సంపత్' చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదల చేయడానికి నిర్ణయించారు. ఇందులో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Go Back to Shorts
Shruti Hassan
Chiranjeevi
Nani
Rajendra Prasad

More Telugu News