నితీశ్‌ను చూడండి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్య నిషేధం విధించండి: నడ్డాను కోరిన ఉమాభారతి
- మధ్యప్రదేశ్‌లో మద్యం దుకాణాల పెంపు ప్రతిపాదనపై దుమారం
- నితీశ్ కుమార్ వరుస విజయాలకు కారణం మద్య నిషేధమేనన్న సీనియర్ నేత
- ఇతర మార్గాల ద్వారా పోయిన ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని సూచన
- ఉమాభారతి వరుస ట్వీట్లు
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు మద్యమే కారణమని ఉమా భారతి అన్నారు. మద్య నిషేధం కారణంగా కోల్పోయే ఆదాయాన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పూడ్చుకోవచ్చని అన్నారు. దుకాణాల పెంపుపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వెనక్కి తగ్గిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఈ సందర్భంగా ఉమాభారతి ప్రశంసించారు.